మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు కరెక్ట్ కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చౌక బారు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ ఫోటో ఉంది, అది తీయమని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ముందు మాటలో ఆ పేజీ తొలగించి పంపించమని చెప్పామన్నారు. SCRT ఉద్యోగుల తప్పిదం వలన ఇలా జరిగిందని, బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సంబంధిత అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం కాలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో మొదటి సారిగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామన్నారు.


