28.4 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టాప్‌లో పాకిస్థాన్.. మరి భారత్ స్థానం..?

స్వతంత్ర వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా డ‌బ్యూటీసీ టైటిల్ పోరులో  రెండు సార్లు తుది మెట్టుపై  బోల్తా ప‌డింది. అయితే  ఈ ఏడాది జ‌రిగిన ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయి రెండోసారి ర‌న్న‌ర‌ప్ టైటిల్‌తో స‌రిపెట్టుకుంటుంది. డ‌బ్యూటీసీ 2023 -25 క‌ప్ కొట్టాల‌నే ఆశ‌యంతో మ‌ళ్లీ పోరును మొద‌లుపెట్టింది. వెస్టిండీస్‌పై ఫ‌స్ట్ టెస్ట్‌ గెలుపుతో డ‌బ్ల్యూటీసీ 2023 -25 పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

అయితే ఇండియా, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగియ‌డంతో ఒక గెలుపు, ఒక ఓట‌మితో ఇండియా రెండో స్థానానికి ప‌డిపోయింది. పాకిస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్ర‌స్తుతం శ్రీలంక‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది పాకిస్థాన్‌. తొలి టెస్ట్‌లో విజ‌యంతో పాకిస్థాన్ డ‌బ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌కు 12 పాయింట్లు, ఇండియా 16 పాయింట్ల‌తో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో రెండు విజ‌యాలు, ఒక ఓట‌మి, ఒక డ్రాతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిల‌వ‌గా, ఒక గెలుపు, రెండు ఓట‌ములు, ఒక డ్రాతో నాలుగో స్థానంలో ఉంది.

యాషెస్ సిరీస్‌తో డ‌బ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్ మొద‌లైంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌పంచ టెస్ట్ దేశాలు అన్ని క‌లిసి 68 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఇందులో ప్ర‌తి జ‌ట్టు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల షెడ్యూల్‌లో టీమ్ ఇండియా 20 టెస్ట్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. వెస్టిండీస్ సిరీస్ త‌ర్వాత టెస్ట్‌ల‌కు టీమ్ ఇండియా సుదీర్ఘ‌కాలం దూరంగా ఉండ‌నుంది. మ‌ళ్లీ డిసెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడ‌నుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్