31.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

స్వంతంత్ర సంక్షిప్త వార్తలు

ఆత్మీయ సమావేశాలు షురూ

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఉగ్ర నరసింహరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వేదికగా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు బారీగా హాజరయ్యా రు. వివిధ పార్టీలకు చెందిన పలువురు పార్టీలో చేరగా. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిం చారు నేతలు. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందన్నారు వక్తలు.

స్వామివారి సన్నిధిలో…

తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, తారకరత్న సతీమణి ఆలేఖ్యరెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండ పంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, టిటిడి అధికారులు తీర్థప్రసాదాలను అందించారు.

పరీక్షలు నిర్వహించండి సారూ…!

గత ఏడాది జులై 26న నోటిఫికేషన్‌ ఇచ్చిన మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ – MPHA ఫిమేల్‌ పరీక్షలను వెంటనే నిర్వహించాలని అభ్యర్దులు కోరారు. మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయన్నవీరు పరీక్షల నిర్వహణపై గత సర్కార్‌ను ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. రేవంత్‌ సర్కార్‌ పరీక్షలు నిర్వహించి రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలని అభ్యర్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ప్లాగ్‌ మార్చ్‌ ..

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని సౌత్ ఈస్ట్ జోన్ లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ మార్చ్‌లో కేంద్ర బలగాలతోపాటు స్ధానిక పోలీసులు పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతా లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.

ఉపవాస దీక్షలు

ముస్లింల పండుగైన రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సూర్యోదయానికి ముందు భోజనాలు చేయడంతో ఉపవాసదీక్షను ప్రారంభించే ముస్లింలు సూర్యాస్త మయం తర్వాత దీక్షను విరమిస్తారు.. అయితే మక్కా నగరానికి నెలవైన సౌదీ అరేబియాలో ఆదివారమే నెలవంక కనిపించింది.

అక్రమ రవాణాకు చెక్‌

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రుద్రారం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 35. 470 టన్నుల రేషన్‌ బియ్యానికి అడ్డుకట్ట వేసారు పోలీసులు. బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీని సీజ్‌చేసి ఇద్దరు వ్యక్తుల్నిఅదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుండి కర్ణాటకకు తరలిస్తున్నఈ బియ్యాన్ని జాతీయ రహదారిపై రుద్రారం ఢాబా వద్ద పట్టుకున్నారు అధికారులు.

లారీ బైక్‌ ఢీ – వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో లారీ బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతున్ని కొమురం భీం జిల్లా రెబ్బన మండలం పైకాచి గూడ కు చెందిన మహేష్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ బాలకృష్ణ ను చికిత్సకై మంచిర్యాల ఆస్పత్రికి తరలించి బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దొంగల ముఠా అరెస్ట్‌

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసారు ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు. అనిల్ కుమార్, భీమిలి రాజ్ కుమార్, కారం రాము, రాజ్ కుమార్ అనే నలుగుర్ని కల్లూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 97 గ్రాముల బంగారం,120 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏడున్నర లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు పోలీసులు.

యువకుడు గల్లంతు

కొమురం భీమ్ జిల్లా పెద్దవాగు లోకి స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు, రెబ్బెన మండలానికి చెందిన 5గురు యువకులు నీటిలో స్నానాలు చేస్తున్న క్రమంలో లోతును గమనించలేక మునిగి పోయారు. ఈత వచ్చిన నలుగురు యువకులు ప్రాణాలతో ఒడ్డుకు రాగా విఘ్నేష్ అనే యువకు డు గల్లంతయ్యాడు. గల్లంతైన విఘ్నేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కుస్తీ పోటీలు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బస్వలింగాయప్ప మఠంలో కుస్తీ పోటీలు జరిగాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు సోమయప్ప స్వామి నగదు బహుమతులను అందజేసారు.

ఓటీటీలోకి మై అటల్‌ హూ

దేశ మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయీ జీవిత కథ ఆధారంగా రూపొందిన మై అటల్‌ హూ స్ట్రీమిం గ్‌కు సిద్దమైంది. పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రవి జాదవ్‌ దర్శకత్వం వహిం చారు. ప్రముఖ ఓటీటీ జీ-5లో ఈనెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్