25.2 C
Hyderabad
Friday, November 14, 2025
spot_img

Prem Kumar Movie: మా సినిమా అలా ఉండదు… అందరూ చూడొచ్చు- దర్శకుడు అభిషేక్ మహర్షి

స్వతంత్ర వెబ్ డెస్క్: సంతోష్ శోభ‌న్ (Santosh Shobhan) హీరో.. రాశీ సింగ్ (Rashi Singh), రుచిత సాదినేని (Ruchita Sadineni) హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’ (Prem Kumar)..సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Saranga Entertainments) ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ల‌వ్, ఎంటర్టైన్మెంట్  అంశాలతో తెర‌కెక్కిన ‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో ముచ్చటించారు.

చిట్ చాట్ వివరాలు ఇవిగో…

మీ నేపథ్యం ఏంటి? ఈ సినిమా కథ ఎలా ప్రారంభమైంది?
అభిషేక్ మహర్షి: పలు సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీటీలో కొన్ని షోలకి కూడా రాశాను. ‘పేపర్ బాయ్’ అయిపోయిన టైంలోనే సంతోష్ శోభన్‌ను కలిశాను.. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. చివరకు సినిమా చేశాం. నా దగ్గర ఉన్న 30 కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు ప్రేమ్ కుమార్ కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు.

ఇది వరకు మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా పని చేశారా?
అభిషేక్ మహర్షి: నేను ఇది వరకు ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ నేను చాలా ప్రొడక్షన్ కంపెనీల్లో రైటర్‌గా పని చేశాను. నా యాక్టింగ్ కెరీర్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కరోనా వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. ఈ మూవీ పాయింట్ కొత్తగా ఉంటుంది.

ఏ దర్శకుడి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది?
అభిషేక్ మహర్షి: హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్ ఇలా అందరూ ఎంతో పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేసి తీస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. నేను నటుడిగా వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ అనుభవాలన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి.

విశ్వక్ సేన్ నటించిన సినిమాతో పోలిక పెడుతున్నారు కదా?
అభిషేక్ మహర్షి: సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి… హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ మూవీ దర్శకుడితో మాట్లాడాక… కాన్సెప్ట్ వేరని అర్థమైంది.

స్క్రిప్ట్ పూర్తయ్యాక ఏమైనా మార్పులు జరిగాయా?
అభిషేక్ మహర్షి: మా టీంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమీ రాలేదు. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే, స్క్రిప్ట్ ఓకే చేస్తే… డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఎలాంటి మార్పులు చేయలేదు.

మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?
అభిషేక్ మహర్షి: మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ చదువుకునే రోజుల నుంచి నాకు తెలుసు. శ్రీచరణ్ పాకాల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. కామెడీ జానర్ ఆయనకు కొత్త. ఈ సినిమాకు ఫ్యూజన్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండింగ్ పరంగా కొత్త ఫీలింగ్ వస్తుంది.

ఈ కథ, ఈ టైటిల్ ఎలా పుట్టింది?
అభిషేక్ మహర్షి: కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథను రాశాను. పీటల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి.

నిర్మాత శివ ప్రసాద్ గురించి చెప్పండి?
అభిషేక్ మహర్షి: సినిమాల మీద మా నిర్మాత శివ ప్రసాద్‌కి ఎంతో తపన ఉంది. ఊరికే ఏదో సినిమా తీసేద్దామని అనుకోలేదు. సంతోష్, నేను, శివ ముగ్గరం కూడా ఎక్కడో ప్రారంభించి ఇక్కడి వరకు రావడమే సక్సెస్‌గా భావిస్తాం.

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
అభిషేక్ మహర్షి: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఎక్కడా అసభ్యత, బూతులు ఉండవు. అమ్మానాన్నలతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడొచ్చు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇందులో నా భార్య, నేను కూడా గెస్ట్ రోల్స్‌‌లో కనిపిస్తాం. నెక్ట్స్ ఫుల్ లెంగ్త్ సీరియస్ సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్టోరీ రెడీగా ఉంది. సెప్టెంబర్ కల్లా స్క్రిప్ట్ రెడీ అవుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్