స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఆయన సోదరుడు పీరుకట్ల ప్రభాకర్ రవు పసుపు కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇంఛార్జి కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు వారిద్దరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పీరుకట్ల సోదరులతో పాటు వారి అనుచరులు కూడా టీడీపీలో చేరారు. వీరి చేరికతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోనుంది.