గత బీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మూడవ రోజు 18 మంది ఇంజనీర్లు విచారణకు హాజరుకానున్నారు. నిన్న 16 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించిన కమిషన్ వారిపై సీరియస్ అయింది. ఆపిడవిట్‌లో పేర్కొన్న తప్పుడు సమాచారంపై ప్రశ్నల వర్షం కురిపించింది. డిజైన్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కట్టారని కమిషన్ ప్రశ్నించిన కమిషన్.. ఏఈ గంగం వేణుబాబు అనే పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్లాకుల నిర్మాణంలో ఆర్డర్ ప్రకారం కట్టకపోవడాన్ని తప్పుపట్టింది.
2 A బ్లాక్‌కు సంబంధించిన అంశంపై డిజైన్ల విషయంలో ఇంజినీరింగ్ అధికారి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి కూడా ఎలా తప్పు చెబుతావంటూ కమిషన్ ప్రశ్నించింది. క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఓ ఇంజినీర్‌ను కమిషన్ హెచ్చరించింది. బ్లాకుల నిర్మాణంలో రిటైర్డ్ ఈఎన్సి నల్ల వెంకటేశ్వర్లు ఆదేశంతోనే ముందుకెళ్ళామని డీఈ బండారు భద్రయ్య చెప్పారు. ప్లేస్మెంట్ రిజిస్టర్స్, మెజర్మెంట్ బుక్స్‌పై అధికారుల సంతకాలు తీసుకొని పంపించింది. ఇక ఇవాళ మరో 18 మంది ఇంజినీర్ అధికారులను కమిషన్ విచారించనుంది.