ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. గత 8 రోజులుగా ప్రజలతో మమేకమవు తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్ ఇవాళ ఒక రోజు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ నెల్లూరులోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. బస్సు యాత్ర 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నేతలతో సమీక్షించనున్నారు.


