26.9 C
Hyderabad
Sunday, March 8, 2026
spot_img

మరోసారి బండారు సత్యనారాయణ మూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వినిపించిన విషయం విధితమే. ఇందుకు కౌంటర్ గా మంత్రి రోజా విరుచుకుపడ్డారు. అదేవిధంగా వైసీపీ నేతలు సత్యనారాయణ మూర్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఆయన ఇంటి చుట్టూ మొహరించిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి  మాజీమంత్రి బండారు సత్యనారాయణ  మూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  చంపాలనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తల బలం కోటి మంది ఉన్నారు. మేము అంతా రాజమండ్రి బయలు దేరితే ఉప్పెన ఖాయం అన్నారు. ముఖ్యమంత్రికి పోలవరం ప్రధానమైన అంశమా.. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల మీద డిస్కషన్ ముఖ్యమా..? అని ప్రశ్నించారు. అధికారం, పోలీసు అండ శాశ్వతం కాదని ముఖ్యమంత్రికి అర్ధం అయ్యేలా సీనియర్ మంత్రులు చెప్పాలన్నారు బండారు సత్యానారాయణ మూర్తి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్