బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన కొడంగల్‌లో రైతు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయడంలో విఫలం చెందడంతో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పట్నం ఆరోపించారు. ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మభ్యపెడుతోందన్నారు. రైతు భరోసా నిధులు 15 నిమిషాల్లో రైతుల ఖాతాల్లో వేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 6 గ్యారంటీలలో ఒక్కటి తప్ప మిగతావి అమలు కాలేదని దుయ్యబట్టారు. కేటీఆర్ పర్యటన, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పట్నం కోరారు.