స్వతంత్ర వెబ్ డెస్క్: విభిన్న కథాంశంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రం 2012లో సూపర్ హిట్ అయింది. వేరే భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) పేరుతో ఈ చిత్రం ప్రస్తుతం రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ‘ఈశ్వరుడికి ఆస్తికుడు .. నాస్తికుడు అనే భేదం లేదు .. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు .. శరణాగతి చేసినవారిని తప్పక రక్షిస్తాడు’ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ‘ఉజ్జయిని మహాకాళేశ్వరుడు’గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనులను జరుపుకుంటోంది. అక్షయ్ కుమార్ – అశ్విన్ వర్దే కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. ‘ ఓ మై గాడ్’ లో పరేశ్ రావెల్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తే, ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.