25.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

TS Govt Jobs: వైద్యారోగ్య శాఖలో 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1520 (ఫిమేల్‌) ఏఎన్‌ఎం (మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌–ఫిమేల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి  నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు రుసుము కింద రూ. 500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ తదితర కేటగిరీలకు చెందిన వారు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. అర్హత సాధించినవారికి నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులు స్వీకరణ ఆగస్టు 25న ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 5:30తో ముగుస్తుంది.

మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సు లేదా ఇంటర్‌లో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ అండ్‌ మిడ్‌ వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి. ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్‌ ట్రైనింగ్‌ లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్‌ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి.

 

రాతపరీక్ష ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రెండింటిలో ఏ పద్ధతిలో ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై త్వరలో వెల్లడిస్తామని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా మార్కులు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్న వారు ధ్రువీకరణపత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. జోన్లవారీగా పోస్టులను కేటాయిస్తారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

Latest Articles

అదానీ లంచం కేసు వ్యవహారంపై స్పందించిన వైట్‌హౌస్

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చుట్టూ వివాదం అలముకున్న వేళ భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్