స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ, బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో, టీడీపీ బంద్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ సెటైరికల్ పంచ్ వేశారు. కనీసం, చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు.
కాగా, మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ బంద్ గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారు. అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదు. ఎవరూ కనీస సానుభూతి కూడా చూపించలేదు. చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని నారా లోకేశ్ కూడా చెప్పలేడు. ఎన్టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎందకు చెప్పలేరు. అలాంటి అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తున్నారు. సీఎం జగన్ హయాంలో ఏపీలో పేదరికం బాగా తగ్గింది. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగింది. చంద్రబాబు, నారా లోకేశ్‌ల అవినీతి మీద కేసులు వేస్తే వారు స్టేలు తెచ్చుకున్నారు. వీటిని విచారణకు సహకరించి.. వారు ప్రజల వద్దకు రావాలని సూచించారు.