స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్–3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ సెంటర్‌లో ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త తరానికి మీరు రోల్ మోడల్, మీ పరిశోధనలు, ఏళ్ల తరబడి చేసిన కృషి, అనుకున్నది చేస్తారని మరోసారి నిరూపించారు అని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు.
చంద్రయాన్ -3 విజయంతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు. దేశ ప్రజలకు మీపై నమ్మకం ఉందని, అలాంటి నమ్మకాన్ని సంపాదించడం చిన్న విషయం కాదన్నారు. దేశ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయన్నారు. ఏ వైఫల్యం చివరిది కాదు, కాబట్టి మన చంద్రయాన్ -2 ఫుట్‌ప్రింట్స్ పడి ఉన్న ప్రదేశాన్ని నేటి నుంచి తిరంగా పాయింట్ అని పిలుద్దామని, చంద్రయాన్ -3 దిగిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ పాయింట్ అని, ప్రకటించారు.
శివశక్తిలోని శివ.. మానవత్వం శ్రేయస్సుకు ప్రతీక. శక్తి.. మానవాళి సంక్షేమ ఆకాంక్షలకు తగిన ధైర్యం, స్థైర్యాన్ని అందిస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేశా’ అని అన్నారు. మేకిన్ ఇండియా ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. మంగళ్‌యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదాం అని అన్నారు.