25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

కాంగ్రెస్ తొలి జాబితాలో పొంగులేటి, తుమ్మలకు నో ఛాన్స్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ రావులకు సీటు దక్కింది. కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​లకు మాత్రం చోటు లభించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు సీటు పొంగులేటికి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ స్థానాలపై హైకమాండ్ ఇంకా స్పష్టతకు రాకపోవడం.. మరోవైపు పాలేరు సీటు తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుండటం వల్ల ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.

మరోవైపు వామపక్షాలతో కాంగ్రెస్‌ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగూడెం, చెన్నూర్‌ సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించగా.. చెన్నూర్‌ బదులు బెల్లంపల్లి ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు పాలేరు, మిర్యాలగూడ ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 55 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వామపక్షాల సీట్లు ఖరారు చేసి.. మిగతా స్థానాల్లో స్పష్టత వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనుందని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్