స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణఫై దృష్టి పెట్టింది. రేపు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రి పదవులు ఎవరకి కేటాయించాలనే దానిపై అధిష్టానంతో చర్చలు జరిపారు. ఈ మేరకు మొత్తం 24 మందితో కూడిన తుది జాబితా రెడీ చేసినట్లు సమాచారం.
కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనెల 20న సిద్ధూ, డీకేతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటి వరకు వారికి ఎలాంటి శాఖలను కేటాయించలేదు. రేపు మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖలను కేటాయించే అవకాశం ఉంది. దీంతో మొత్తం 32మంది మంత్రులు సిద్ధరామయ్య మంత్రివరర్గంలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.