విశాఖ బీచ్ లో లభించిన శ్వేత డెడ్‌బాడీ కేసులో కొత్త కోణం బయటకొచ్చింది. అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. ఆ లేఖలో ఆమె భర్త పేరుతో పాటు బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అంటూ రాసింది. దీంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తాను శ్వేతను వేదింఛలేదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుపోవాలని తనకు చెప్పానని తెలిపాడు. శ్వేతతో ఫోన్ మాట్లాడుతుండగానే తన ఫోన్ స్వీఛాఫ్ వచ్చిందని చెప్పాడు. తాను ఐదు నెలల గర్భవతి అని.. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైన ఆలోచించాల్సిందన్నాడు. మరోవైపు పోలీసులు కూడా శ్వేత బాడీపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. అయితే దర్యాప్తు మాత్రం కొనసాగుతోందన్నారు. కాగా ఇవాళ ఉదయం వైఎంసీఏ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతదేహం కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.