స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తే.. వారం మొత్తం ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వేసవి మొత్తం చిన్న సినిమాల హవానే నడిచింది. ఇక జూన్ మాసం మొత్తం కూడా అన్ని చిన్న సినిమాలే సందడి చేయనున్నాయి. మరి ఈ వారం ఇటు ఓటీటీలో, అటు థియేటర్‌లో విడుదలకి సిద్ధం అయినా వెబ్ సిరీస్‌లు, సినిమాలేంటో చూసేయండి..
అహింస
తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ సినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌పై పి. కిరణ్ నిర్మించారు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు తనయుడు అభిరామ్ ఈ సినిమాతో వెండితెరకి హీరోగా పరిచయమవుతున్నారు.
నేను స్టూడెంట్ సర్!
బెల్లంకొండ గణేష్ రెండో ప్రయత్నంలో ‘నేను స్టూడెంట్ సర్!’ అనే సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి రానుంది.
ఐక్యూ
సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ జీఎల్‌బి తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది.
పరేషాన్
రానా దగ్గుబాటి సమర్పకుడిగా.. విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలుగా సురేష్ ప్రొడక్షన్స్ తీసుకువస్తున్న చిత్రం ‘పరేషాన్’. కొత్త రకమైన కామెడీతో జూన్ 2న థియేటర్‌లో విడుదలకి సిద్ధమైంది ఈ సినిమా.
చక్రవ్యూహం
అజయ్ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్ తెరకెక్కించిన చిత్రం ‘చక్రవ్యూహం’. సహస్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ‘‘మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
ఓటీటీలో విడుదలకి సిద్దమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు.
నెట్‌ఫ్లిక్స్
ఫేక్ ప్రొఫైల్ (వెబ్‌సిరీస్) మే 31
ఎ బ్యూటిఫుల్ లైఫ్ (హాలీవుడ్) జూన్ 1
న్యూ ఆమ్‌స్టర్ డామ్ (వెబ్‌సిరీస్) జూన్ 1
ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్) జూన్ 1
స్కూప్ (హిందీ సిరీస్) జూన్ 2
మ్యానిఫెస్ట్ (వెబ్‌సిరీస్) జూన్2
జీ 5
విష్వక్ (తెలుగు) జూన్ 2
డిస్నీ+ హాట్‌స్టార్
సులైకా మంజిల్ (మలయాళం) మే 30