బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరామండి: డైమండ్ బజార్’ ప్రపంచవ్యాప్తంగా ఓటిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ఒక కళాఖండం అంటూ విమర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు వెండితెరపై ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో OTT ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, బ్రేకింగ్ బాడ్ వంటి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సిరీస్‌లతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో హీరామండి ఒకటి అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉత్కంఠభరితమైన విజువల్స్ నుండి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ భన్సాలీ ప్రతిభకు నిదర్శనం. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన “హీరామండి: ది డైమండ్ బజార్” మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో 190 దేశాలలో విడుదలైంది.


