స్వతంత్ర వెబ్ డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఛీఫ్ శరద్ పవార్‌ను చంపేస్తామంటూ వాట్సప్‌లో బెదిరింపు వచ్చింది. తన తండ్రిని బెదిరిస్తూ వాట్సప్‌లో తనకు మెసేజ్ వచ్చినట్లు పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. దీంతో ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘గురువారం నాకు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఓ వెబ్‌సైట్ ద్వారా పవార్‌ను బెదిరిస్తూ ఆగంతకులు సందేశం పంపారు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి, కేంద్ర హోంమంత్రి త్వరితగతిన జోక్యం చేసుకోవాలి. పవార్‌జీ ఈ దేశ నేత. ఆయన భద్రత బాధ్యత కేంద్ర హోంశాఖదే. దీనిపై అమిత్ షా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు నీచ రాజకీయాలకు నిదర్శనం. ఇవి వెంటనే ఆగాలి’’ అని సుప్రియా డిమాండ్ చేశారు. అయితే, ఈ మెసేజ్ ఎవరు పంపారన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
శరద్ పవార్‌కి ప్రాణ హాని.. చంపేస్తామంటూ కూతురికి మెసేజ్
Latest Articles
- Advertisement -