27.6 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

నారా రోహిత్ ‘ప్రతినిధి-2’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాతో నారా రోహిత్ ఎంతమంచి హిట్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ తాజాగా తన తదుపరి సినిమాను ప్రకటించారు. తన 19వ సినిమాగా ‘ప్రతినిధి-2’ను చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

‘ప్రతినిధి-2’ చిత్రం ఫస్ట్ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. న్యూస్ పేపర్‌తో డిజైనర్ చేసిన నారా రోహిత్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. సామాజిక అంశం ఇతివృత్తంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. కుమార్ రాజా, ఆంజనేయులు శ్రీ తోట, కొండకల్ల రాజేందర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్