స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు (Pedakurapadu)నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 182వ రోజు గార్లపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గార్లపాడు స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. తరువాత లగడపాడు స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గీయులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది.
4గంటల 15నిమిషాలకు పెదకూరపాడు జంక్షన్‌లో రైతులతో సమావేశమవుతారు. 4 గంటల 20నిమిషాలకు ముస్లింలతో భేటీ అవుతారు. అనంతరం లింగంగుంట్లలో స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. తర్వాత 5గంటల 50నిమిషాలకు పొడపాడులో వైసీపీ బాధితులతో సమావేశం అవుతారు. 6గంటల 35నిమిషాలకు పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రాత్రి 7గంటల 35నిమిషాలకు సిరిపురం శివారు విడిది కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది.