నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంప్ సైట్ అంబేడ్కర్(Ambedkar) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశం అభ్యుదయ పథంపై నడవాలని అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివని అన్నారు. ప్రతిఒక్కరు అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇంఛార్జ్ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.