తొలిసారి సతీమణి శోభితతో కలిసి నాగచైతన్య పబ్లిక్ లోకి వచ్చాడు. తండేల్ సక్సెస్ మీట్ కి శోభిత తో కలిసి నాగచైతన్య హాజరయ్యాడు. ఇక పెళ్లయిన తర్వాత చైతూకి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. తండేల్ రూపంలో పెద్ద హిట్ అందుకున్నాడు.
పెళ్లి తర్వాత శోభిత, నాగచైతన్య కలిసి ఓ సినీ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం ఇదే తొలిసారి. శోభిత చీర కట్టుకుని సంప్రదాయ బద్ధంగా నాగచైతన్యతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో జంట చూడముచ్చటగా కనిపించింది.
తండేల్ ఈనెల 7న రిలీజ్ అయింది. ఇక తండేల్ ఇంత పెద్ద సక్సెస్ అవడంతో నాగార్జున ఆనందం వ్యక్తం చేశాడు. తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయన కంటే కూడా నాగ చైతన్య, శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్టేజ్ మీద ప్రతి ఒక్కరూ నాగచైతన్యను పొగుడుతుంటే శోభిత ముసిముసి నవ్వులు నవ్వకున్నారు.
ఇక నాగార్జున కూడా శోభితకే క్రెడిట్ ఇచ్చాడు. నాగచైతన్య లైఫ్ లోకి శోభిత వచ్చిన వేళా విశేషం… అంటూ పొగడ్తలతో ముంచేశాడు. తండేల్ లో చైతూ నటన చూసిన తర్వాత నాన్నగారే గుర్తొచ్చారని అన్నాడు నాగార్జున
నాగార్జున మాట్లాడటానికి ముందు ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని సీన్స్ ను ఏవీలాగా చూపించారు. అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో కొడుకు, కోడలు ముందు ఇలాంటి వీడియోలు చూపించొద్దు అని నాగార్జున అనడంతో అందరూ నవ్వేశారు.