స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా యూత్ క్రష్ కృతిశెట్టి నటించింది. నిజాయితీగా ఉండే ఓ పోలీస్ ఆఫీసర్ కు ఎదురయ్యే సవాళ్లను ఈ ట్రైలర్లో చూపించారు మేకర్స్. ‘ఒకసారి న్యాయం వైపు నిలబడి చూడు.. నీ లైఫ్ మారిపోతుంది .. నిజం గెలవడానికి లేటు అవుతుంది .. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. చైతూ కెరీర్ లోనే తొలి బైలింగ్వల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. అరవింద్ స్వాస్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు.