13.7 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

‘నచ్చినవాడు’ ట్రైలర్ రిలీజ్

స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై లక్ష్మణ్ చిన్నా , కావ్య రమేష్ హీరో హీరోయిన్‌గా వెంకటరత్నంతో కలిసి లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మిజో జోసెఫ్. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, విజువల్ గా మరియు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కథకి అనుగుణంగా అందరిని కొత్తవాళ్లను తీసుకున్నాను, అందరు బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ మెజ్జో జోసెఫ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రేక్షకులు ఈ చిత్రం చూశాక మంచి ఫీల్ తో ఇంటికి వెళ్తాడు , సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఆగస్టు 18న విడుదల కు సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.

హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

నటి లలిత నాయక్ మాట్లాడుతూ “నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

నటుడు ఏ.బి. అర్.పి. రెడ్డి మాట్లాడుతూ “నచ్చినవాడు అద్భుతమైన సినిమా. ఆడవాళ్లు గురించి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా అందంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమా తో వస్తున్నా లక్ష్మణ్ చిన్నా కి నా అభినందనలు” అని తెలియజేసారు.

దర్శన్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. సినిమా చాలా బాగుంది, ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరు చూడండి” అని తెలిపారు.

కెమెరా మాన్ అనిరుద్ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, మంచి కంటెంట్ ఉన్న చిత్రం, అందరికీ నచ్చుతుంది. మిజో జోసెఫ్ మంచి సంగీతం ఇచ్చారు” అని తెలిపారు.

ఈ చిత్రానికి సాహిత్యం అందించిన హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “నేను చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కి లిరిక్స్ రాసాను కానీ సినిమా పాటలకి పని చేయడం ఇదే మొదలు. లక్ష్మణ్ చిన్నా గారు నాకు ఒక పాట ఇచ్చారు, ఉదయం ట్యూన్ వస్తే మధ్యాహ్నం కాళ్ళ లిరిక్స్ రాసి పంపించాను, తర్వాత అని పాటలు నన్నే రాయమని చెప్పారు. పాటలు చాలా బాగా వచ్చాయి, మిజో జోసెఫ్ సంగీతం చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధిస్తుంది” అని కోరుకున్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్