ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటు రావడంతో వెంటనే ఎయిమ్స్ తరలించినా సర్వేశ్ సింగ్ ఆస్పత్రిలో మరణించారు. ఏప్రిల్ 19న తొలిదశలో మొరాదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కున్వర్ సర్వేశ్ సింగ్ పోటీ చేశారు. పోలింగ్ జరిగిన మర్నాడే.. ఆయన మరణించడంతో పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. కున్వర్ సర్వేస్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.


