స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీ అఫ్ మెడికల్ సైన్సెస్ సభ్యులు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, అక్కినేని మణి లపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంభందించి రూ.307.61 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వెల్లడించింది. తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఖాతాలు, భూములు 15.61 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కోవిడ్ సమయంలో సొసైటీ పేరుతో వసూలైన డబ్బులను దారి మళ్లించినట్టు వస్తున్న ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు తీసుకుంది.