స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బ్రో(BRO ) సినిమా రెమ్యూనరేషన్, శ్యాంబాబు క్యారెక్టర్‌పై వివాదం రేగితే. నిన్న భోళా శంకర్(Bola Shankar) సినిమా టికెట్లు వివాదం తెరపైకి వచ్చింది.. ఈలోపు పవన్ కళ్యాణ్‌పై(Pavan Kalyan) మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai)సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఆమె పవన్, బ్రో సినిమా వివాదం గురించి ప్రస్తావించారు.. ఈ క్రమంలో రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Ram Babu)ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అని ట్వీట్(Tweet) చేశారు. మంత్రి బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను ప్రస్తావించారు.
మంత్రి ట్వీట్‌కు జనసైనికులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటో చూడాలని చురకలంటించారు. రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ మధ్య విడుదలైన సినిమాలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయని తనకు తెలిసిందన్నారు. ఆ వివాదం ఏంటో తనకు పెద్దగా తెలియదని.. అయితే పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని.. పవన్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలు గురించి ప్రస్తావన ఉంటుందని కొందరు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఒక తల్లిగా పిల్లల్ని ఈ వివాదాల్లోకి లాగొద్దని వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశారు. రాజకీయాల్లోకి తన పిల్లలనే కాదు.. ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ఇరువురు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.


