కేంద్రప్రభుత్వంపై తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అన్నారు. పదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. మోడీ నాయకత్వంలో అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే లాభపడ్డా యని ఈ సందర్భంగా తెలియజేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్బరంగా మారిందని తెలిపారు. మరోవైపు టీడీపీ, వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలేరన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.


