27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

మూడోసారి ప్రమాణ స్వీకారానికి సద్ధమైన మోదీ…. మంత్రి పదవుల్లో భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత

   కేంద్ర కేబినెట్ ఎలా ఉండబోతోంది ? ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యపక్షాలు ఈసారి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో వాటికి ప్రధానమైన శాఖలను కమలదళం అప్పగిస్తుందా లేదంటే ద్వితీయ శ్రేణి పోర్ట్ ఫోలియోలు అప్పగిస్తారా? మరి ఏపీ, తెలంగాణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి ? కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న వేళ అందరిలో ఇవే ప్రశ్నలు. మరోవైపు ఈనెల 9న సాయంత్రం ఆరుగం టలకు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అట్ట హాసంగా జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల తోపాటు విదేశాల నుంచి కీలక నేతలు హాజరుకానున్నారు.

  ప్రధానమంత్రిగా మూడోసారి పీఠం అధిరోహించేందుకు నరేంద్రమోడీ సమాయాత్తమవుతున్నారు. ఇందు లో భాగంగా ఈనెల 9న ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్డీయే పక్షాల నేతలు, ఎంపీలు సమావేశమై ప్రధానిగా మోడీ నేతృత్వానికి జైకొట్టారు. దీంతో కేంద్రంలో కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరడం, ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని చెప్పాలి.కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న మోడీ తన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండవచ్చు. ఆ లెక్కన చూసు కుంటే ప్రస్తుతం 81 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే 2014, 2019 మాదిరిగా బీజేపీకి సొంతంగా మేజిక్ ఫిగర్ లేకపోవడంతో ఈసారి కూటమి పార్టీలకు ప్రాతినిథ్యం పెరగనుంది. వారికి వచ్చిన ఎంపీ సీట్ల ఆధారంగా కేంద్రమంత్రి పదవులను, సహాయ మంత్రి పదవులను ప్రధాని మోడీ కేటాయించే ఛాన్సుంది. అయితే.. కేంద్రంలో అత్యంత కీలకమైన హోంశాఖతోపాటు ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలను మాత్రం కమలనాథులు తమ వద్దే పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.

    భాగస్వామ్యపక్ష పార్టీల్లో ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్నది ఆయా పార్టీల అధినేతలకే వదిలేయ నున్నారు ప్రధాని మోడీ. ఇక, తమ సొంత పార్టీకి చెందిన ఎంపీల్లో సామాజిక సమీకరణాలు, రాష్ట్రాల వారీ లెక్కలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులు కేటాయించనున్నారు. అయితే, 2019 లో ఏర్పాటైన మంత్రివర్గంలో సభ్యులుగా ఉండి, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 22 మంది ఓటమి పాలయ్యారు. ఇక, ఎన్నికలకు ముందుగానే ఓ పదిమంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఈసారి కేంద్రమంత్రి వర్గం సరికొత్త రూపు సంతరించు కోనుంది. మొత్తం ఎన్డీయేలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన శిండే వర్గం, లోక్‌జన శక్తి, ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర చిన్నా చితకా పార్టీలన్నింటికీ వారి వారి సంఖ్యాబలం ఆధారంగా కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పదవులు దక్కబోతున్నాయి. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వం లో కమల నాథులు, సంఘ్‌ నేతలు, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశమై ఓ క్లారిటీకి రానున్నాయి.

    కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రాకతో ఏపీతోపాటు తెలంగాణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కవ చ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. మొదటగా ఏపీ విషయానికి వస్తే, టీడీపీకి అత్యధికంగా 16 ఎంపీ సీట్లు దక్కాయి. పైగా ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ కూడా. ఈ పరిస్థితుల్లో కీలక పదవులు తెలుగు దేశానికి దక్కే అవకాశాలున్నాయి. ఓ అంచనా ప్రకారం రెండు కేంద్రమంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులు టీడీపీకి లభించవచ్చన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ పదవుల కోసం ప్రధానంగా రామ్మోహన్ నాయుడు, ప్రసాదరావు, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. అయితే, ఈ పదవుల్లో ఏదైనా తేడాలు జరిగినా డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు తీసుకోవాల్సి వచ్చినా ఈ పేర్లలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు జనసేన బీజేపీ నుంచి కూడా పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ప్రధానం గా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు జనసేన నుంచి రేసులో మొదటగా విన్పిస్తోంది. బీజేపీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్ పేర్లపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందన్న మాట విన్పిస్తోంది.

    తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంపై మరింతగా దృష్టి సారించనుంది కాషాయపార్టీ. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే తమ లక్ష్య మని ఇప్పటికే కమలం నేతలు చెబుతున్నారు. దీంతో పార్టీలో మరింతగా ఉత్సాహం పెంచేందుకు బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ కమలం ఎంపీల్లో ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. పార్టీలో సీనియారిటీ, విధేయత, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు కేటాయింపులు ఉండనున్నాయి. దీంతో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంత్రివర్గం రేసులో ప్రధానంగా విన్పిస్తున్న పేరు కిషన్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. పైగా సీనియర్. ఇప్పటికే కేంద్రమంత్రిగా అనుభవం ఉంది. అటు డీకే అరుణ పేరుపైనా ప్రచారం సాగుతోంది. ఇక, బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పేర్లు బలంగా విన్పిస్తు న్నాయి. మరి మోడీ, షా మనసులో ఏముంది? ఎవరెవరికి ఏయే పదవులు దక్కుతాయన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు అట్టహాసంగా జరగనున్న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార మహోత్స వానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక, విదేశీ అతిథుల విషయా నికి వస్తే, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్‌, సీషెల్స్ అధినేతలు ఈ కార్యక్రమా నికి తరలి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నేతలకు ఆహ్వానాలు కూడా పంపినట్లు ప్రచారం సాగు తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్