24 C
Hyderabad
Tuesday, March 17, 2026
spot_img

మోదీ అంటే గ్యారెంటీ !

       దేశాభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. 7 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్స వాలను వర్చువల్‌గా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహ కారం ఉంటుందని హామీనిచ్చారు. అనంత రం విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పై విమర్శలు గుప్పించారు.

      తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి పదేళ్లైందన్న ఆయన.. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అంటూ వెల్లడించారు. ఆదిలాబాద్‌లో పర్యటించిన పీఎం.. ఏడు వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శంఖుస్థాపనలు వర్చువల్‌గా నిర్వహించారు.

      ఇప్పటికే తెలంగాణలోహైవేలను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన… ఎన్టీపీసీ రెండో యూనిట్ సహా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోం దని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు మోడీ. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలే నిదర్శనం అంటూ అభివర్ణించారు ప్రధాని. ఇక, కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన… ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరి స్తుందన్నారు. రాష్ట్రానికి పెద్దన్నలా ప్రధాని మోడీ సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

      శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం ఆదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని చెప్పుకొ చ్చారు. త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లు గెలవాలని ఆకాంక్షించారా యన. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై పదునైన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌ పాలనలో నిర్మిం చిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిం దన్నారు ప్రధాని. అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి మార్పు లేదంటూ విమర్శలు గుప్పించారు.140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబమంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. ఇక, ఇటీవలి కాలంలో అందరూ మాట్లాడుకుంటున్నట్లుగా.. మోడీ గ్యారెంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారెంటీగా అభివర్ణించారు ప్రధాని.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్