విశాఖ స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు.
స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.స్థానిక వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని బొత్స తెలిపారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని, అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దామని బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసేముందు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌ను బొత్స సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా బొత్సను జగన్ అభినందించారు.