ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇళ్లులు కూల్చుతున్నారని నిప్పులు చెరిగారు. మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అనుమతి లేదంటూ వైసీపీ ఎంపీని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తమ వారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డగిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారని, వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని తెలిపారు.


