అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కుల గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో 96 శాతం ఆర్థిక, సామాజిక సర్వే చేశామని చెప్పారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీల స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయనివాళ్లు ఇప్పుడు మమ్మల్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. కుల గణనపై ప్రతి పక్షాల విమర్శలను బీసీలపై దాడి గానే చూస్తామన్నారు. కుల గణన సర్వేలో కేసీఆర్ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే అధికారులకు డిటైయిల్స్ ఇఛ్చారని మంత్రి పొన్నం చెప్పారు.