కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ బియ్యాన్ని ఇతర బియ్యంతో కలుపుతూ ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో ఆయన తనిఖీ చేశారు. తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉన్న బియ్యం బస్తాలను గుర్తించారు. 100 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కార్డుదారుల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచారు. లారీతోపాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన్నట్లు తెలిపారు.