స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన మాటలు, చేష్టలు అందరినీ అలరిస్తుంటాయి. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై చాలా మిక్స్ క్రియేట్ వచ్చాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా నిత్య యువకుడిలా హుషారుగా డ్యాన్స్ చేశారు.
వరల్డ్ హార్ట్ డేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్టేజ్ పైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ రాగానే అక్కడున్న వారితో ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు. సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం స్టేజ్ కిందకు వచ్చి అందరితో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.