స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలకృష్ణ తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదు అని ప్రశ్నించారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఇటీవల ఆ సంస్థే ప్రకటించింది. రాష్ట్రమంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు. టీడీపీ ప్రభుత్వం బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి?. ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గోప్పొడా? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చినది చంద్రబాబుకే. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన ఘనత వైసీపీది. అందుకు నీతి ఆయోగ్ లెక్కలే నిదర్శనం. చంద్రబాబు పాలన స్కాంలైతే వైసీపీ ప్రభుత్వం స్కీంలు అని మంత్రి పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. “నాలుగు నెలల క్రితమే నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో సహా ఇక్కడే ఉంటున్నా. రాజధాని కావడంతోనే వైజాగ్‌లో ఇల్లు తీసుకుని మారిపోయాను. సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ కోసం అనువైన భవనాల ఎంపిక కొనసాగుతోంది. మా శాఖకు చెందిన ఆస్తులు లేనందున ప్రైవేట్ భవనాల కోసం పరిశీలిస్తున్నాం.” అని మంత్రి అన్నారు.