స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వైద్యారోగ్యశాఖలో ఈ నెల 22వ తారీఖున 1,069 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యకు హబ్‌గా తెలంగాణ మారుతుందని అన్నారు. బోధన ఆసుపత్రుల్లో పనితీరుపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ లక్ష్యం మేరకు పేదలకు వైద్యంతో పాటు విద్యార్ధులకు వైద్య విద్య అందుతోందని ధీమా వ్యక్తం చేశారు. మనమంతా కలిసి సీఎం కేసీఆర్ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ర్యాగింగ్ నియంత్రణ పాటించడం.. విద్యార్థులకు అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.