స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లుగీత కార్మికుడి అవతారమెత్తారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన పాలకుర్తి మండలం మల్లంపల్లిలో స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కారా. నిచ్చెన సాయంతో చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తెచ్చారు. అనంతరం ఆ కల్లును హాయిగా సేవించారు. ఎర్రబెల్లి ఎక్కిన చెట్టును మూడేళ్ల కిందట ఆయన అందిచిందే. కల్లుగీత కార్మికులకు ప్రోత్సాహం కోసం గిరక తాటి మొక్కలు అప్పుడు ఆయన పంపిణీ చేశారు. అవి ఇప్పుడు పెరిగి పెద్దవై, కల్లు అందిస్తున్నాయి. గిరక తాటిచెట్లు తక్కువ ఎత్తు పెరిగి స్వల్పకాలంలోనే కల్లు గీతకు అందుబాటులోకి వస్తాయి. ఈ చెట్లు అయితే సులువుగా ఎక్కడంతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు వీటిని పంపిణీ చేస్తోంది.


