రెండవ రోజు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. గత వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు కూటమి సభ్యులు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీలో వైసీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని విమర్శలు గుప్పించారు కూటమి నేతలు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంతలో పశువుల మాదిరి పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు.
ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. APPSC పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అసెంబ్లీ వేదికగా ఆరోపించారు ఆయన.. ప్రాథమిక నివేదిక ప్రకారం కూడా అవకతవలు జరిగాయని వెల్లడైన్పటికీ ఇంకా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.
అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి వంగలపూడి అనిత. జగన్ శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అనిత.. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.