Medico Preethi case | మెడికో విద్యార్థిని ప్రీతి లక్ష్యంగానే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించినట్లు ఆధారాలు లభించాయని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. స్వతహాగా ప్రీతి ధైర్యవంతురాలని.. ఆమె ప్రశ్నించే తత్వాన్ని సైఫ్ సహించలేకపోయాడని వెల్లడించారు. దీంతో ఆమె టార్గెట్ గా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టి మానసికంగా వేధించాడన్నారు. సైఫ్ వేధింపుల గురించి ఈనెల 20వ తేదీన తండ్రి దృష్టికి తీసువెళ్లిందని ఆయన చెప్పారు. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రీతి వేధింపులు తట్టుకోలేక మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వాట్సాపుల్లో వేధించినా ర్యాంగింగ్ కిందకే వస్తుందని.. అందుకే నిందితుడు సైఫ్ ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కోర్టు ముందు హాజరుపరుస్తామని సీపీ పేర్కొన్నారు.