20.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

అక్టోబర్ 27న రాబోతున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందనను పొందింది. తెలుగు సినిమాలలో ఇదో కొత్త అనుభూతిని ఇస్తోంది. అలాగే ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారు.

అక్టోబర్ 9 నుండి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యటనను ప్రారంభించారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు మరియు వరంగల్ వంటి నగరాల్లో ముందస్తు ప్రీమియర్‌ షోలను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల కానుంది. అలాగే ఆ వారాంతంలో విడుదలవుతున్న భారీ చిత్రాలతో పాటుగా అక్టోబర్ 19 నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 400 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించబడుతుంది.

‘మార్టిన్ లూథర్ కింగ్’ ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. ‘మార్టిన్ లూథర్ కింగ్’ 2023, అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పంపిణీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఏపీ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ పంపిణీ భాగస్వామిగా ఉంటుంది.

తారాగణం: సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా
దర్శకత్వం: పూజ కొల్లూరు
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా
కథ: మడోన్ అశ్విన్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
డీఓపీ: దీపక్ యరగెరా
ఎడిటర్: పూజ కొల్లూరు
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
కాస్ట్యూమ్ డిజైనర్: జి.ఎన్.ఎస్. శిల్ప

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్