25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

‘మార్కెట్ మహాలక్ష్మి’ మెప్పించిందా?

సినిమా: మార్కెట్ మహాలక్ష్మి
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, పూజా విశ్వేశ్వర్ తదితరులు.
రచన, దర్శకత్వం: వీఎస్ ముఖేష్
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
సంగీతం: జో ఎన్మవ్
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
విడుదల తేదీ: 19-04-2024

‘కేరింత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం హీరోగా నటించిన మూవీ ‘మార్కెట్ మహాలక్ష్మి’. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కొత్తమ్మాయి ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఒకవైపు క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు హీరోగా చేసిన పార్వతీశంకు ‘మార్కెట్ మహాలక్ష్మి’ సక్సెస్ ఇచ్చిందా? కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలించింది అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం..

కథ:
కథ 2010లో స్టార్ట్ అవుతుంది. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు చుట్టుపక్కల వాళ్లు వాళ్ల పిల్లలను ఇంజినీరింగ్ చదివించి అమెరికా పంపించారని తెలిసి.. ప్రభుత్వాఫీసులో గుమస్తాగా పని చేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడి(పార్వతీశం)ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తాడు. అతనికి కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయితో పెళ్లి చేసి తను పెట్టిన ఖర్చులకు వడ్డీతో సహా రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితం కాదంటారు కదా.. అందుకే పార్వతీశం తన తండ్రి చెప్పిన అమ్మాయిని కాకుండా మార్కెట్‌లో కూరగాయలు అమ్మే మహాలక్ష్మి(ప్రణీకాన్విక)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే తండ్రి పక్షవాతంతో మంచాన పడడం, అన్న కార్టర్ కృష్ణ(మహబూబ్ బాషా) తాగుడుకు బానిస అవడంతో మహాలక్ష్మే కుటుంబ బాధ్యతను భుజాలకెత్తుకుంటుంది. చిన్నప్పటి నుంచే రెబల్‌గా పెరగడంతో ప్రేమ, దోమ వంటి వాటికి దూరంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిని ప్రేమలో పడేయడానికి హీరో పార్వతీశం ఏం చేశాడు? తండ్రిని కాదని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ఈ కథలో కిశోర్(ముక్కు అవినాష్), కసక్ కస్తూరి(పూజా విశ్వేశ్వర్) పాత్రలేంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే టైటిల్‌తోనే ఇదొక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసిపోతుంది. అందుకేనేమో డైరెక్టర్ ముఖేష్ ఈ సినిమాలో హీరోకు పేరు కూడా పెట్టకుండా కథను నడిపించేశారు. సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. పెళ్లి అయ్యాక ఆడపిల్ల అత్తవారింటికి రావాలనే సంప్రదాయం మనది. అయితే ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి. ఆడ-మగ సమానం అన్నప్పుడు ఆడవాళ్లే తమ తల్లిదండ్రులను వదిలి భర్త ఇంటికి ఎందుకు రావాలి అనే ప్రశ్నించడమే ఈ సినిమా నేపథ్యం. తండ్రి చూపించిన ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె తెచ్చే కట్నానికి అమ్ముడుపోయి బతకడం కంటే ఇండిపెండెంట్‌గా బతికే ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే భరోసా ఉంటుందని ఆలోచించే హీరో కథే ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ అని చెప్పొచ్చు. డైరెక్ట్‌గా చెప్పాలంటే మగాడు ఇల్లరికం ఎందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించే సినిమా. డైరెక్టర్ ముఖేష్ తన ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన స్టోరీని తీసుకుని ఈ సినిమా కథ రాసినట్లు చెప్పారు. కొన్ని వైవిధ్యమైన జీవితాలు సినిమా కథలకు పనికొస్తాయనే పాయింట్‌ను నమ్మి డైరెక్టర్ ఈ కథను తీసుకున్నారు. తను తీసుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్‌లో అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. సినిమా చూసే ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవకుండా ఉంటేనే సినిమా పూర్తిగా సక్సెస్ అయినట్లు. అందువల్ల సాగదీతలు ఉన్నచోట్ల ట్రిమ్ చేస్తే బాగుంటుంది. కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయినా ఒకట్రెండు సీన్లు ప్రేక్షకులకు సిల్లీగా అనిపిస్తాయి. సీనియర్ ఆర్టిస్ట్, రచయిత, దర్శకుడు అయిన హర్ష వర్ధన్ క్యారెక్టర్ ద్వారా హీరో పాత్రకు గీతోపదేశం చేయిస్తాడు. మొత్తంగా అయితే డైరెక్టర్ తను అనుకున్న పాయింట్‌ను అనుకున్నట్లు చెప్పడంలో ఎక్కడా తడబడలేదు.

నటీనటుల విశ్లేషణ:
హీరో పార్వతీశం ఈ కథను ఎంచుకున్నందుకు ముందుగా అతడిని అభినందించాలి. మార్కెట్‌లో పనిచేసే అమ్మాయిని లవ్ చేసే సాఫ్ట్‌వేర్ కుర్రాడి పాత్రలో పార్వతీశం చాలా బాగా చేశాడు. కొత్తమ్మాయి ప్రణీకాన్విక రెబల్ అమ్మాయి క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. సినిమా చివరి వరకూ ఎక్కడా కూడా ఆమె ముఖంలో నవ్వు కనిపించదు. అయితే పార్వతీశంతో ఆమె జోడీ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్‌గా చేసిన ముక్కు అవినాష్, హీరోయిన్ అన్నగా చేసిన మహబూబ్ బాషా నవ్వులు పండించారు. మహబూబ్ బాషా కొన్ని సీన్లలో జూనియర్ తాగుబోతు రమేష్‌లా అనిపించాడు. ‘సలార్’ తర్వాత ఇందులో కసక్ కస్తూరి పాత్రలో నటించిన పూజా విశ్వేశ్వర్ తనదైన మేనరిజంతో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు ముకేష్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి రావడంతో తను చేసే సినిమా ఎంత వరకు ఉండాలో, ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో మొత్తం క్లారిటీతో ఉన్నాడు. కేవలం 26 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సాంకేతికంగా సక్సెస్ సాధించాడు. సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. జో ఎన్మవ్ ఇచ్చిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. క్లైమాక్స్‌లో వచ్చే డీజే సాంగ్ తప్ప ఇతర పాటలు ప్రేక్షకులకు గుర్తుండవు. సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాత అఖిలేష్ కలారు కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడం అంటే ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఏంటో తెలిసేలా చేస్తుంది.

చివరిగా.. డిఫరెంట్ పాయింట్‌తో కూడిన ‘మార్కెట్ మహాలక్ష్మి’ని ఓసారి చూసేయొచ్చు!

రేటింగ్: 2.5/5

 

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్