స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. దీంతో జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ ప్రస్తుతం మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో బస్తర్ సభ్యుడిగా ఉన్నారు. ఉద్యమాలకు ఆకర్షితుడైన ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితమే అందులోకి వెళ్లారు. అనంతరం అంచెలు అంచెలుగా ఎదుగుతూ పార్టీలో కీలక సభ్యుడిగా మారారు.