రేవంత్ సర్కార్‌పై మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. వర్గీకరణ చేయకుండా నియామకాలు చేపట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి విషయంలో మాదిగలు వర్గీకరణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకునే వాల్లు.. ఉమ్మడి సమస్యల పరిష్కారాన్ని కూడా అడ్డుకున్నట్టే అని అన్నారు. మాదిగల మహాసభలు, నిరసనలతో కాంగ్రెస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామని హెచ్చరించారు.


