Viral Video |ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ మరింత ఫేమస్ అయింది. ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ నగలు దుకాణంలో మేనేజర్ తన టీమ్ తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్కార్ వేదికపై నుంచి సినీ నటి దీపికా పదుకొణె గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవను పరిచయం చేస్తూ నాటు నాటు సాంగ్ గురించి మీకు తెలుసా.. తెలుసుకుంటే మీరు ఆ పాటకు డ్యాన్స్ చేస్తారంటూ చెప్పినప్పటి నుంచి ఆ పాటకు స్టెప్పులేస్తున్న వారి సంఖ్య ఆమాంతం పెరగిపోయింది. తాజాగా నగల దుకాణం నిర్వాహకుడు తన బృందంతో కలిసి నాటు నాటు పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video |ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో నగల దుకాణంలో మేనేజర్ తన టీమ్ కు నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నట్లు కనిపిస్తోంది. తొలుత మేనేజర్ వేస్తున్న స్టెప్పులను అనుసరించిన వారంత ఆ తర్వాత.. తమ స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను చంద్రబోస్ రాయగా.. ఎంఎం కీరవాణి స్వరపర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటను పాడిన విషయం తెలిసిందే.
ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసినప్పటి నుంచి 1.6 మిలియన్ల మందికి పైగా వీక్షించడంతో పాటు నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram