28.2 C
Hyderabad
Monday, May 20, 2024
spot_img

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టిపెట్టిన ప్రధాన పార్టీలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో ఎలక్షన్‌పై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీ లు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వరుసగా సమీక్షలు చేస్తున్నాయి. అన్ని పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా చూస్తుండడంతో పట్టం ఎవరికి అన్నది ఆసక్తి కరంగా మారింది.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి మూడు జిల్లాల నేతలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. పట్టభద్రుల స్థానంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం సమాప్తమైనప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన హడావిడి మొదలైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందటం, ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజెపి తరపున ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా అశోక్, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బక్క జడ్సన్‌ పోటీలో ఉన్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలుచేస్తోంది. మిగిలిన పార్టీలైతే ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుండటంతో ఇప్పటి నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి అన్ని పార్టీలు.ఇప్పటికే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రచార వ్యూహలు, విజయావకాశాల కోసం చేయాల్సిన ప్రయత్నాలు, దశల వారీగా ప్రచార ప్రణాళికలు, నేతల సమన్వయం కోసం మూడు జిల్లాల నాయకులతో కమిటీలు. ఇలా ఒకటేమిటి భిన్న రకాలుగా ముందుకెళుతూ పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం దీనిపై పడకుండా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు కేటీఆర్.

అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా శాసనమండలిలో తమ వారి సంఖ్య తక్కువగా ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ఆయా జిల్లా నేతలతో రివ్యూ సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే లు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కాంగ్రెస్‌కు 33 మంది ఎమ్మెల్యే లు ఉండడంతో గెలుపు విషయంలో ఏ మాత్రం రాజీపడొద్దని సహచరులకు దిశానిర్దేశం చేశారు ముఖ్య మంత్రి. అటు.. బీజేపీ సైతం ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంది. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో పూర్తి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూర్తిగా తన దృష్టిని ఈ ఎన్నికపైనే నిలిపారు. ఆర్గనైజేషనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారితో కలిసి మూడు జిల్లాల నేతలు, రాష్ట్ర స్థాయి నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న మూడు జిల్లాలకు రాష్ట్ర నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిం చారు. మొత్తంగా తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి. మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరిది పైచేయి అవు తుందో త్వరలోనే తేలనుంది.

Latest Articles

నేడు ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

   దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్