డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురం పీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే యూనిట్‌ను కలెక్టర్ షాన్‌మోహన్, ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. యూనిట్‌ను 15 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశారు. తర్వాత ఆర్ఆర్‌బీహెచ్ఆర్ కాలేజి విద్యార్థులకు కలెక్టర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. ఆసుపత్రికి సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 38 సమస్యలు గుర్తించామన్నారు. 9 పనులు దీపావళి లోపు పూర్తవుతాయని కలెక్టర్ చెప్పారు.