27.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

హీరో విశాల్‌పై మద్రాసు హైకోర్టు జడ్జి ఆగ్రహం

హీరో విశాల్‌పై మద్రాస్‌ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్‌ కోర్టులో హాజరయ్యారు. వైట్ పేపర్స్‌పై తాను సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట విశాల్‌ వాదించాడు. దీనిపై జడ్జ్‌ ఆగ్రహించారు. తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా.. ఇదేం షూటింగ్ కాదు.. సరిగ్గా సమాధానం చెప్పండి అంటూ విశాల్‌పై న్యాయమూర్తి ఫైరయ్యారు.

విశాల్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడ‌క్షన్స్‌ మధ్య కొన్నాళ్ల కిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేదంటూ 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ 15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో గానీ, ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదంటూ స్టే విధించింది.

కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించార‌ని.. త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించ‌కుండానే ఆయ‌న న‌టించి, నిర్మించిన ప‌లు సినిమాల‌ని విడుద‌ల చేశార‌ని విశాల్‌పై లైకా సంస్థ జూన్‌ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. కానీ అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.

Latest Articles

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్