24.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

మా సినిమాలో కిల్లర్ ఎవరో కనిపెడితే రూ. లక్ష బహుమతి: మోహన్ వడ్లపట్ల

సీనియర్ దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను దర్శకత్వం వహించిన ‘ఎంఫోర్ఎం’ సినిమా విడుద‌లైన‌ తొలిరోజు చూసి కిల్ల‌ర్ ఎవ‌రో కనిపెడితే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ‘ఎంఫోర్ఎం’ సినిమాను ప్రవాస భారతీయురాలు జో శర్మ హీరోయిన్‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్టుతో రూపొందించామని, 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవ‌రూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేశామని తెలిపారు. రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని మోహన్ వడ్లపట్ల వ్య‌క్తం చేశారు.

మోటివ్ ఫర్ మర్డర్ ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం తాను అమెరికా నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చానని, ఇందులో తాను ఇన్విస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా చేశానని, క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌తో న‌డిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుందని హీరోయిన్ జో శర్మ చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను త్వ‌ర‌లోనే 5 భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్నామన్నారు.

హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. నేను ముందుగా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ వడ్లపట్ల గారికి. నాకు గాడ్‌ఫాద‌ర్ ఆయ‌న‌. నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైద‌రాబాద్‌కు ఈ ఏడాదే ఆరు సార్లు వ‌చ్చాను. నేను ఇందులో ఇన్విస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా చేశాను. క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌తో న‌డిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా చూసిన వాళ్లంద‌రి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

ఈ సంద‌ర్బంగా గోవా తీరంలో హీరోయిన్ జోశర్మ (USA) తళుక్కుమంటూ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. M4M మూవీ ట్రైలర్ గోవాలో లాంచ్ చెయ్యడం కొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇలాంటి కాన్సెప్ట్ 110 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్ అని, తాను ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం గ‌ర్వంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్లకు, IMPPA ప్రముఖులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెర‌కెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను త్వ‌ర‌లోనే 5 భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, In Association with McWin Group USA.

తారాగణం:
జో శర్మ (ప్రధాన నటి) (USA), సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు), శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్

సాంకేతిక సిబ్బంది:
కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ
స్క్రీన్ ప్లే: మోహన్ వడ్లపట్ల, రాహుల్ ఆడబాల
దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
డైలాగ్స్: శ్రీచక్ర మల్లికార్జున
సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై
DOP: సంతోష్ షానమోని
Stunts: యాక్షన్ మల్లి
ఎడిటింగ్: పవన్ ఆనంద్
Mixing: విష్ణు వర్ధన్ కాగిత, కార్తికేయ స్టూడియో
DI: రత్నాకర్ రెడ్డి, కలర్ లాజిక్స్
VFX/CG: కొత్తపల్లి ఆది, వెంకట్
సౌండ్ డిజైనర్: సాగర్
దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, శ్రీచక్ర మల్లికార్జున, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి, గోవింద్, రాజు, వెంకట్, వంశీ
PRO: పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Latest Articles

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బౌన్సర్ల అంశాన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులకు చూపించారు ముఖ్యమంత్రి రేవంత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్